మాజీ మంత్రి విడదల రజినిపై దాడి అమానుషం

మాజీ మంత్రి విడదల రజినిపై దాడి అమానుషం

SKLM: మాజీమంత్రి విడుదల రజిని పై పోలీసులు హేయంగా ప్రవర్తించడం పట్ల మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ మండిపడ్డారు. ఆదివారం నరసన్నపేట వైసీపీ కార్యాలయంలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఆమె పట్ల సీఐ సుబ్బారాయుడు అనుచితంగా ప్రవర్తించడం దౌర్జన్యం చేయడం సరి కాదని పేర్కొన్నారు. ఒకరిని పరామర్శించేందుకు వెళ్తున్న ఆమెపై ఇలా దాడి చేయడం సరి కాదన్నారు.