VIDEO: భక్తిశ్రద్ధలతో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

NZB: ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామంలో మోక్ష ధర్మ ట్రస్ట్, దానధర్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్రతంలో పాల్గొన్న 50 మంది మహిళలకు చీరలు, లక్ష్మీదేవి పీఠాలను బహుకరించారు. హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ట్రస్ట్ నిర్వాహకులు పేర్కొన్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.