విద్యుత్‌ స్తంభం పడి వ్యక్తి మృతి

విద్యుత్‌ స్తంభం పడి వ్యక్తి మృతి

ఎన్టీఆర్‌ జిల్లా: నందిగామలో శనివారం ఓ విషద ఘటన చోటు చేసుకుంది. నందిగామలో హిందూ స్మశాన వాటికలో ఉన్న విద్యుత్‌ స్తంభం పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. అదే సమయంలో అక్కడ ఉన్న నలుగురు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. అయితే స్థానిక ప్రజలు ఇది విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వలనే జరిగిందని మండిపడుతున్నారు.