నేటి నుంచి RU లా సెమిస్టర్ పరీక్షలు: వీసీ
KRNL: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో లా సెమిస్టర్ పరీక్షలను నేటి నుంచి 28వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు వీసీ ఆచార్య వెంకట బసవరావు ఓ ప్రకటనలో తెలిపారు. 3, 5, 7, 9వ సెమిస్టర్ పరీక్షలను, రెగ్యులర్, సప్లమెంటరీ పరీక్షలు కూడా ఈ తేదీల్లోనే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బీటెక్ ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ సప్లమెంటరీ పరీక్షలు కూడా ఇదే తేదీల్లో ఉంటాయన్నారు.