మట్టి వినాయకుని విగ్రహాలు పంపిణీ

NGKL: కల్వకుర్తి పట్టణంలోని గాంధీనగర్ మున్సిపాలిటీ సిల్వర్ జూబ్లీ క్లబ్ వద్ద మంగళవారం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. అనంతరం ఆర్ఎస్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోడ నరసింహ, మహేశ్వర్ రెడ్డి, కుడుముల శేఖర్ రెడ్డి, ప్రదీప్ కుమార్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.