ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి : సీఐ
SDPT: అరైవ్ అలైవ్' కార్యక్రమంలో భాగంగా శనివారం ట్రాఫిక్ అవగాహన సదస్సు నిర్వహించారు. సీఐ శ్రీను మాట్లాడుతూ.. ప్రమాదాల నివారణకు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం, అతివేగం నియంత్రణపై దృష్టి పెట్టాలన్నారు. 'సిద్దిపేట సురక్ష నేత్ర'లో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, 'ఉద్యోగ మిత్ర' జాబ్ మేళాను యువత వినియోగించుకోవాలని తెలిపారు.