రైతులకు అధికారి సూచనలు

ప్రకాశం: బేస్తవారిపేట మండలంలోని నేకునాంబాద్ మరియు చింతలపాలెం గ్రామాలలో ''పొలం పిలుస్తుంది'' కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ రఫీక్ మాట్లాడుతూ.. యూరియాకు బదులుగా నానో యూరియా వాడటం వలన కలిగే అధిక ప్రయోజనాల గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.