ముసురుతో మూగబోయిన సాంచెల సవ్వడి

BHNG: ఆలేరులో పది రోజులుగా వర్షాలు కురుస్తూ ముసురు అలుముకోవడంతో చేనేత కళాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిల్క్ నగర్, మార్కండేయ కాలనీ, కాంత్రి నగర్, భారత్ నగర్ కాలనీలతోపాటు మండలంలోని కొలనుపాక, టంగుటూరు, శారాజీపేట గ్రామాల్లో ముసురు ప్రభావం మార్కెట్ లేదని నేతన్నలు వాపోతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆర్థికంగా కుదేలవుతున్నారు.