ఎమ్మెల్యే దగ్గుపాటిని కలిసిన గ్రంథాలయ ఛైర్మన్
ATP: ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌గా నియమితులైన వడ్డే వెంకట్ శనివారం అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధిపై వారు చర్చించారు.