మార్కెట్ యార్డ్‌ను పరిశీలించిన బల్లా పల్లవి

మార్కెట్ యార్డ్‌ను పరిశీలించిన బల్లా పల్లవి

అనంతపురం మార్కెట్ యార్డ్‌ను చైర్‌పర్సన్ బల్లా పల్లవి శనివారం తెల్లవారుజామున 4 గంటలకు ఆకస్మికంగా పరిశీలించారు. యార్డ్‌లోని పరిస్థితులను సమీక్షించి, అక్కడి వసతులపై ఆరా తీశారు. వ్యాపారస్తులు, రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.