VIDEO: 'ఓటు హక్కును వినియోగించుకోవాలి'
JN: జనగామ మండలం సమీర్ పేట గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఆదివారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రిత్ సింగ్ పరిశీలించారు. ఆయన ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా బందోబస్తు, సిబ్బంది సమన్వయాన్ని సమీక్షించి సమస్యలపై అధికారులకు సూచనలు అందించారు. పోలింగ్ సక్రమంగా సాగుతుందని, ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని తెలిపారు.