ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎస్సై
NLR: జలదంకి మండలం ప్రజలందరి జీవితాల్లో ఈ దీపావళి పండుగ వెలుగులు నింపాలని, టపాసులు కాల్చే సమయంలో పిల్లల పట్ల పెద్దలు జాగ్రత్త వహించాలని కోరుతూ.. మండల ప్రజలందరికీ ఎస్సై సయ్యద్ లతీ ఫున్నిసా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అమావాస్యనాటి కారు చీకటిని తొలగించడానికి, దీపాలతో వెలుగును నింపడం ఈ పండుగ సంప్రదాయమని ఆమె పేర్కొన్నారు.