కమల్ బర్త్ డే స్పెషల్.. 'విక్రమ్' రీరిలీజ్

కమల్ బర్త్ డే స్పెషల్.. 'విక్రమ్' రీరిలీజ్

లోకనాయకుడు కమల్ హాసన్ పుట్టిన రోజును ఆయన సూపర్ హిట్ చిత్రం 'విక్రమ్'ను ఈ నెల 7న రీరిలీజ్ చేయనున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను అభిమానుల కోసం.. హైదరాబాద్‌లోని సంధ్య 35MM, విమల్ 70MMతో పాటు విజయవాడలోని అలంకార్, వైజాగ్‌లోని సంగం థియేటర్లలో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.