మంత్రికి వినతి పత్రం అందించిన ఎమ్మెల్యే
JN: రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఇవాళ కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో గిరిజనులకు అవసరమైన మౌలిక వసతుల కొరతపై ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా గిరిజనుల సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు గిరిజన భవనాల అవసరం ఉందని వివరించారు.