'సీహెచ్‌సీ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా'
GDWL: అయిజలో నిర్మాణం తుది దశలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ) అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని బీజేపీ గద్వాల జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి ఆరోపించారు. శుక్రవారం పార్టీ శ్రేణులతో కలిసి భవనాన్ని పరిశీలించిన ఆయన, మూడేళ్లుగా అందుబాటులోకి రాకపోవడంతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలిపారు.