తాగునీటి కోసం భక్తుల ఇక్కట్లు
MBNR: చిన్నచింతకుంటలో పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి భక్తులు శని, ఆదివారాల్లో భారీగా వస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం మెట్ల మార్గంగా వెళ్లే భక్తులకు తాగునీటి కోసం నల్లాలు ఏర్పాటు చేశారు. తాగునీరు రాకపోవడంతో చంటి పిల్లలు, తల్లులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.