డీజే సౌండ్, ర్యాలీలు నిషేధం

డీజే సౌండ్, ర్యాలీలు నిషేధం

VKB: కుల్కచర్ల మండలంలో ఎన్నికల ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు, బైక్ శోభాయాత్రలు పూర్తిగా నిషేధమని ఎస్సై రమేష్ స్పష్టం చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కొనసాగుతున్నందున, గెలిచిన అభ్యర్థులు, వారి అనుచరులు భారీ సభలు, డీజేలు, బైక్ ర్యాలీలు వంటి వేడుకలు నిర్వహించరాదని హెచ్చరించారు. ఈ ఆంక్షలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.