భార్యను కొట్టిన కేసులో భర్త అరెస్ట్
KNR: భార్యను కొట్టిన కేసులో భర్త సత్తనేని కరుణాకర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. రూరల్ మండలం ఆరేపల్లికి చెందిన కరుణాకర్ గత కొన్ని రోజులుగా తాగి వచ్చి భార్యను కొడుతున్నాడు. ఈ క్రమంలోనే కట్టెలతో కొట్టడంతో తీవ్ర గాయాలై ఆమె ఆసుపత్రిలో చేరింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.