'విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి'
KMR: ఎల్లారెడ్డి తహశీల్దార్ ప్రేమ్ కుమార్ శుక్రవారం స్థానిక మోడల్ స్కూల్/కళాశాలలోని బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో ఉంటున్న విద్యార్థినులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆయన ఆదేశించారు. భోజన సామాగ్రి, పప్పులు, బియ్యం, నూనె వంటి వస్తువుల నాణ్యతను పరిశీలించి, సన్న బియ్యంతో వండిన అన్నాన్ని పరిశీలించారు.