BRSకు షాక్.. కాంగ్రెస్‌లోకి చేరికలు
BHPL: మరిపెడ మండలం సీతారాంపురం గ్రామంలో శనివారం పలువురు బిఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ చీఫ్ విప్ రాంచంద్రనాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఆయన పార్టీ కండువాను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పలు అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై పలువురు పార్టీలో చేరుతున్నారని అన్నారు.