VIDEO: ప్రశాంతంగా ఐసెట్ పరీక్షలు

VIDEO: ప్రశాంతంగా ఐసెట్ పరీక్షలు

పల్నాడు: నరసరావుపేటలో ఏపీ ఐసెట్ పరీక్షలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. కోటప్పకొండ రోడ్డులోని నరసరావుపేట ఇంజినీరింగ్ కళాశాల, గుంటూరు రోడ్డులోని తిరుమల ఇంజినీరింగ్ కాలేజీల్లో పరీక్షలు జరుగుతున్నాయి. MBA, MCA ప్రవేశాల కోసం జరిగే పరీక్షలు ఉదయం 9 నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.