'కుల గణన సర్వే చేపట్టిన టీచర్లకు రెమ్యూనరేషన్ ఇవ్వాలి'
SRD: జిల్లాలో కుల గణన సర్వే చేపట్టిన ఉపాధ్యాయులకు రెమ్యూనరేషన్ ఇవ్వాలని జిల్లా TSUTF అధ్యక్షులు అశోక్, ఉపాధ్యక్షులు కాశీనాథ్ యాదవ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేలో విధులు నిర్వహించిన సూపర్‌వైజర్లకు రూ. 12 వేలు, ఎన్యుమరేటర్లకు రూ. 10 వేలు చొప్పున చెల్లించాల్సింది ఉండగా ఏడాది దాటినా ఇంతవరకు ఇవ్వలేదన్నారు.