నేడు నార్నూరుకు రాష్ట్ర గ్రంథాలయ ఛైర్మన్ రాకా

ADB: నార్నూర్ మండలానికి గురువారం రాష్ట్ర గ్రంథాలయ ఛైర్మన్ ప్రొఫెసర్ రియాజ్ రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు లోఖండే దేవురావు ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు 'సంవిధాన్ బచావో' పై సమావేశం నిర్వహించనున్నామని పేరొన్నారు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.