ఆర్డీవోకు వినతిపత్రం అందజేసిన MJF కన్వీనర్
RR: చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలంలో దళిత జర్నలిస్టులపై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చెయ్యాలని ఎంజేఎఫ్ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా చేవెళ్ల డివిజన్ ఎంజేఎఫ్ కన్వీనర్ మహేష్ ఆశిగారి, కో కన్వీనర్ నర్సాని రమేష్, జర్నలిస్టులు నరేందర్, అమర్, శేఖర్‌లతో కలిసి చేవెళ్ల ఆర్డీవో పార్థసింహారెడ్డికి వినతిపత్రం అందజేశారు.