‘కప్పు టీతో పాక్‌కు ముంచుకొచ్చిన పెను ముప్పు’
2021లో తాలిబన్లతో ISI మాజీ చీఫ్ హమీద్ చేసిన టీ మీటింగ్ కారణంగా పాకిస్థాన్ ఇప్పుడు భారీ మూల్యం చెల్లిస్తోందని Dy. PM ఇషాక్ దార్ విమర్శించారు. ఆ భరోసాతోనే PAK-AFG సరిహద్దులు తెరుచుకున్నాయని.. వేలాదిగా తాలిబన్లు పాక్‌లోకి ప్రవేశించారన్నారు. దీంతో పాక్‌లోని మిలిటెంట్ గ్రూప్‌లు తిరిగి క్రియాశీలమై తమ దేశంపైనే బుసకొడుతున్నాయని దార్ ఆవేదన వ్యక్తం చేశారు.