స్మశాన వాటికకు ఎట్టకేలకు విముక్తి

VZM: తెర్లాం మండలం సుందరాడ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ కులస్తులకు గత కొన్నేలుగా సరైన స్మశాన వాటిక లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంతమంది పాలకులు మారిన ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకునే నాధుడు లేకపోయాడు. ఈ విషయం గ్రామ సర్పంచ్ అద్దంకి దిలీప్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన స్పందించి, ఆదివారం ఆ స్మశాన వాటికకు గ్రావెల్ పోయించారు.