BRS పాలనలో నీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యం: ఎమ్మెల్యే

MHBD: బయ్యారం మండల కేంద్రంలోని బీఎన్ గుప్తా తులరాం ప్రాజెక్టును సోమవారం ఎమ్మెల్యే మురళీ నాయక్ సందర్శించారు. MLA మాట్లాడుతూ.. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని, రైతాంగం కంటే కమిషన్లపై శ్రద్ధ చూపారని ఆయన విమర్శించారు. ఈ ప్రాజెక్టు అభివృద్ధితో మానుకోట, ఇల్లందు నియోజకవర్గాల తాగునీటి సమస్య తీరుతుందని ఆయన వివరించారు.