ఘనంగా ఎడ్ల పొలాల అమావాస్య

ఘనంగా ఎడ్ల పొలాల అమావాస్య

SRD: మండల కేంద్రమైన కంగ్టిలో ఎడ్ల పొలాల అమావాస్య పండుగను శుక్రవారం గ్రామస్తులు ఘనంగా జరుపుకున్నారు. గ్రామానికి చెందిన రైతులు తమ ఎడ్లకు అందంగా అలంకరించి, గ్రామ ఆచార సాంప్రదాయ ప్రకారంగా, క్రమ పద్ధతిలో రైతులు తమ ఎడ్లను స్థానిక హనుమాన్ మందిరం చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఎడ్లకు నైవేద్యం సమర్పించారు.