ప్లాస్టిక్ కవర్ల వినియోగం తగ్గించాలి: కలెక్టర్
సత్యసాయి: హిందూపురంలోని ఎంజీఎం గ్రౌండ్‌లో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ 'వ్యర్థ రహిత సంస్థలు' థీమ్‌ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రీన్ హిందూపురం నినాదంతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని తగ్గించి పేపర్, క్లాత్ సంచులు ఉపయోగించాలని ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.