నేడు ఆందోళనలకు బీజేపీ పిలుపు

నేడు ఆందోళనలకు బీజేపీ పిలుపు

TG: హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీసులో కీలక నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీకి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హాజరయ్యారు. ఈ క్రమంలో ఈనెల 7న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేయాలని సూచించారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ బీజేపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. హైదరాబాద్‌లో యువమోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు.