ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన మంత్రి
ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం మంత్రి స్వామి తన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. పలు ప్రాంతాల నుంచి సమస్యలు చెప్పుకునేందుకు భారీగా మంత్రి కార్యాలయానికి అర్జీదారులు చేరుకున్నారు. ఆయన వారి సమస్యలను సావధానంగా విని అర్జీల రూపంలో ఇచ్చిన సమస్యలపై సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు.