VIDEO: నరసాపురంలో రోడ్డు ప్రమాదం
W.G: నరసాపురం రుస్తుంబాదలోని 216 జాతీయ రహదారిపై గురువారం ఉదయం ప్రమాదం జరిగింది. ఒంగోలు నుంచి మండపేటకు స్క్రాప్ లోడుతో వెళ్తున్న లారీ.. రోడ్డు పక్కన ఆగి ఉన్న మరో లారీని బలంగా ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఢీకొట్టిన లారీ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.