VIDEO: స్వామివారి తెప్పోత్సవంలో అపశృతి
NLR: బోగోలు మండలం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. తెప్పోత్సవం నిర్వహిస్తుండగా ఒక్కసారిగా తెప్ప పక్కకు ఒరిగింది. దీంతో భక్తులు నీళ్లలో పడిపోయారు. అయితే, సామర్థ్యానికి మించి ఒకేసారి తెప్పపైకి 80 మందికి పైగా ఎక్కడంతో ఘటన జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భక్తులు స్వామివారిని చేతులతోనే మోస్తూ ఊరేగించారు.