మాజీ ఎమ్మెల్యేకు జంపాల నివాళులు

NTR: విజయవాడ మాజీ శాసనసభ్యులు అడుసు మిల్లి జయప్రకాష్ వర్ధంతి సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య ఆయనకు ఘన నివాళులర్పించారు. గురువారం నాడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జయప్రకాష్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన సీతారామయ్య, ఆయన అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు.