భర్తపై కోపం.. దారుణంగా హత్య చేసిన భార్య!

భర్తపై కోపం.. దారుణంగా హత్య చేసిన భార్య!

HYD: మేడ్చల్ జిల్లాలో మద్యం మత్తు, కుటుంబ కలహాలు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం కలకలం రేపింది. మద్యం తాగి భర్త తరచూ గొడవ పడుతుండటంతో ఆగ్రహం చెందిన భార్య, అతడిని దారుణంగా హత్య చేసింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.