సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

KKD: రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమం కోసం సీఎం సహాయ నిధిని మంజూరు చేస్తోందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. ఆదివారం ఆయన తన నివాసంలో పది మంది లబ్ధిదారులకు రూ. 9.24 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.