అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

కోనసీమ: గోదావరి వరద పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం మామిడికుదురు మండలం పాసర్లపూడి ఏటిగట్టు దిగువన ఉన్న అప్పనపల్లి కాజ్ వేను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కాజ్ వే ముంపునకు గురయ్యే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని ఎమ్మార్వోకు కలెక్టర్ సూచించారు.