19లోపు దరఖాస్తు చేసుకోండి

NTR: 2025-26 విద్యా సంవత్సరానికి జిల్లాలోని వివిధ ప్రైవేట్ విద్యాసంస్థల్లో 25 శాతం ఉచిత ప్రవేశాలకు ఈనెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యా హక్కు చట్టం ప్రకారం తెల్లరేషన్ కార్డుదారులు కార్పొరేట్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు.