VIDEO: ఎదురెదురుగా ఢీకొన్న రెండు కార్లు.. తప్పిన ప్రమాదం

KMM: ఏన్కూరు మండలం చెన్నారం సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలిలా.. రోడ్డుపై వెళ్తున్న రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కాగా ప్రమాద దాటికి ఒక కారులో మంటలు చెలరేగి దగ్ధమైంది. అటు కారులో ఉన్నవారు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెప్పారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.