సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు: ఎస్సై

సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు: ఎస్సై

KMM: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని చింతకాని ఎస్సై వీరేందర్ అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వాట్సాప్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఇతరులకు హాని కలిగించొద్దన్నారు.