జిల్లాలో 23 పరీక్షా కేంద్రాలు: డీసీవో

జిల్లాలో 23 పరీక్షా కేంద్రాలు: డీసీవో

ASF: సాంఘిక సంక్షేమ, జనరల్ గురుకులాల్లో 5 తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం ఈనెల 22న పరీక్ష నిర్వహిస్తున్నట్లు గురుకులాల జిల్లా సమన్వయ అధికారి శారద తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 23 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 5,847 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. ఆన్‌లైన్‌లో హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు.