VIDEO: కోర్టులో బార్ రూమ్‌ను ప్రారంభించిన ఎంపీ

VIDEO: కోర్టులో బార్ రూమ్‌ను ప్రారంభించిన ఎంపీ

సిద్దిపేట కోర్టు ఆవరణలో ఎంపీ నిధులు రూ.10 లక్షలతో నిర్మించిన నూతన బార్ రూమ్‌ను మెదక్ ఎంపీ రఘునందన్ రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయవాదుల సౌకర్యార్థం ఈ గదిని నిర్మించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేష్, సాయిబాబా, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.