'అక్రమంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లను తొలగించాలి'

MNCL: బెల్లంపల్లి మున్సిపాలిటీలో తెలంగాణ మున్సిపల్ యాక్ట్-2019కి విరుద్ధంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లను తొలగించాలని పట్టణానికి చెందిన న్యాయవాది మాదరి రాకేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర CDMAకి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూముల్లో ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు తొలగించి, మున్సిపాలిటీ ఆదాయం పెంచేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు.