యజమాని దూషణతో గొర్రెల కాపరి మృతి
WGL: రాయపర్తి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన గొర్రెల కాపరి ఆకారపు నరసయ్య, యజమాని దూషణతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు. నరసయ్య, అడ్లూరి శ్రీనివాసరావు వద్ద గొర్రెల కాపరిగా పనిచేస్తూ జీవనం సాగించేవాడని స్థానికులు చెప్పారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.