సీఎంఆర్ సరఫరా వేగవంతం చేయాలి: కలెక్టర్
ADB: జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) సరఫరాను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజార్షి షా మిల్లర్లను ఆదేశించారు. శనివారం కలెక్టర్ ఛాంబర్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. సన్నబియ్యం పూర్తిగా మిల్లింగ్ చేసి సమయానికి సివిల్ సప్లై గోదాములకు అందజేసేలా తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా పౌర సరఫరాల అధికారులకు సూచించారు.