పవన్ కళ్యాణ్‌పై బల్మూరి వెంకట్ ఫైర్

పవన్ కళ్యాణ్‌పై బల్మూరి వెంకట్ ఫైర్

TG: కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మండిపడ్డారు. పవన్‌కు తెలంగాణపై అక్కసు ఉంటే హైదరాబాద్ వదిలి ఏపీలోనే ఉండాలని సూచించారు. తన వైఖరి మార్చుకోకపోతే ఆయన సినిమాలు ఇక్కడ ఆడవని హెచ్చరించారు. పవన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.