పోలీస్ సిబ్బందికి ఘన సన్మానం
AKP: మహిళా దినోత్సవం సందర్భంగా గొలుగొండ పోలీస్ స్టేషన్‌లో మహిళా పోలీసు సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్సై రామారావు, సిబ్బంది మహిళా పోలీసుల సేవలను కొనియాడుతూ.. అభినందనలు తెలిపారు. పోలీస్ శాఖలో మహిళలు నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.