సింగరాయకొండలో భారీ దొంగతనం
ప్రకాశం: సింగరాయకొండలో భారీ దొంగతనం చోటు చేసుకుంది. బాధితులు వివరాల మేరకు.. పట్టణంలోని డ్రైవర్ పేట సమీపంలో నివాసం ఉంటున్న అనిల్ కుమార్ ప్రైవేట్ వైద్యుడిగా పనిచేస్తున్నారు. వ్యక్తిగత పనుల నిమిత్తము రెండు రోజులు క్రితం బెంగుళూరు వెళ్లి ఈరోజు మధ్యాహ్నం వచ్చి చూడగా ఇంటి తాళాలను పగలగొట్టి 90 గ్రాముల బంగారం, కిలో వెండి, 40 వేలు నగదు దుండగులు చేశారు.