మంత్రి వాసంశెట్టికి చెల్లుబోయిన సవాల్
AP: మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు మాజీమంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ సవాల్ విసిరారు. 'వనభోజనాల్లో మాట్లాడిన అంశాలపై చర్చకు సిద్ధమా. లేదంటే కులానికి క్షమాపణ చెప్పాలి. వాసంశెట్టి ఆరోపణలు వాస్తవం కాదని నిరూపిస్తా. నిరూపించకపోతే నేను క్షమాపణ చెబుతా. కులాన్ని ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారో తేలుద్దాం. సమయం, వేదిక చెబితే చర్చకు సిద్ధం' అని పేర్కొన్నారు.