సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని పాత అమదళవలస (గేట్ )8వ వార్డు లో ''సుపరిపాలనలో తొలి అడుగు'' కార్యక్రమం సోమవారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ పాల్గొన్నారు. వార్డులో ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వసంక్షేమ పథకాలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రభుత్వ పథకాలు ప్రతి లబ్ధిదారులకు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు.